Englan: పెళ్లి చేసుకున్న ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు!

England Women Cricketers Katherine Brunt And Nat Sciver Get Married
  • పెళ్లి బంధంతో ఒకటైన బ్రంట్, స్కివర్
  • 2017 ప్రపంచ కప్ కు ప్రాతినిధ్యం వహించిన బ్రంట్, స్కివర్
  • కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు
2017 ప్రపంచ కప్ లో ఆడిన ఇంగ్లండ్ మహిళా టీమ్ క్రికెటర్లు క్యాథరీన్ బ్రంట్, నాట్ స్కివర్ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు శుభాకాంక్షలు తెలిపింది. ఇంగ్లండ్ తరపున బ్రంట్ 14 టెస్టులు, 140 వన్డేలు, 96 టీ20లు ఆడింది. అన్ని ఫార్మాట్లలో ఆమె 316 వికెట్లు తీసింది. మరోవైపు, స్కివర్ 7 టెస్టులు, 89 వన్డేలు, 91 టీ20లు ఆడింది. ఈ ఏడాది జరిగిన వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్స్ లో ఆమె 148 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. వరల్డ్ కప్ లో ఎనిమిది మ్యాచ్ లలో 436 పరుగులు చేసింది. మరోవైపు వీరిద్దరికీ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు శుభాకాంక్షలు తెలిపింది.
Englan
Women Cricketer
Marriage

More Telugu News