అమ్మ ఒడి, వాహన మిత్ర పథకాలు రద్దు అంటూ దుష్ప్రచారం... స్పందించిన ఏపీ ప్రభుత్వం
- సోషల్ మీడియాలో దుష్ప్రచారం
- ఓ నకిలీ ప్రెస్ నోట్ వైరల్
- ఖండించిన ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం
- చర్యలు తీసుకుంటామని వెల్లడి
కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ మేరకు తప్పుడు ప్రచారం జరుగుతోందని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం వివరణ ఇచ్చింది. ఇలాంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని పేర్కొంది. ఈ తరహా దుష్ప్రచారంపై తాము సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం అందించినట్టు తెలిపింది. అధికారికంగా దీనిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అంతేకాదు, సదరు నకిలీ ప్రెస్ నోట్ ను కూడా ఫ్యాక్ట్ చెక్ విభాగం పంచుకుంది.