Elon Musk: మస్క్ 2021 సంపాదన.. 1.82 లక్షల కోట్లు..!

Elon Musk worlds richest man was 2021s highest paid CEO
  • వేతనంతోపాటు, స్టాక్ ఆప్షన్స్ విక్రయించడం ద్వారా అధిక ఆదాయం
  • రెండో స్థానంలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ 
  • తెలుగువాడైన సత్య నాదెళ్లకు ఏడో స్థానం
వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజమే. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 2021 సంవత్సరంలో వేతనంతోపాటు, కంపెనీ స్టాక్ ఆప్షన్స్ విక్రయించడం ద్వారా 23.5 బిలియన్ డాలర్లు సంపాదించినట్టు (భారత కరెన్సీలో రూ.1,82,576 కోట్లు)  ‘ఫార్చ్యూన్ 500’ తాజా నివేదిక వెల్లడించింది. 

2018లో టెస్లా కంపెనీ తనకు కేటాయించిన స్టాక్ ఆప్షన్లలో కొంత భాగాన్ని మస్క్ విక్రయించడం కలిసొచ్చింది. అధిక వేతనం అందుకున్న ఫార్చ్యూన్ సీఈవోల జాబితా ప్రకారం.. యాపిల్ సీఈవో టిమ్ కుక్ 770.5 మిలియన్ డాలర్లను 2021 సంవత్సరానికి అందుకున్నారు. జాబితాలో రెండో స్థానం టిమ్ కుక్ దే. న్విదియా సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈఓ జెన్ సేన్ హాంగ్ 561 మిలియన్ డాలర్లను గతేడాదికి స్వీకరించారు.

నాలుగో స్థానంలో నెట్ ఫ్లిక్స్ రీడ్ హాస్టింగ్స్ 453.5 మిలియన్ డాలర్లను గతేడాది స్వీకరించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో, తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల 309.4 మిలియన్ డాలర్ల పారితోషికాన్ని అందుకుని జాబితాలో ఏడో స్థానంలో ఉన్నారు. అతి తక్కువ అంచనా వేయబడిన సీఈవోగా 2021కి నాదెళ్ల నిలిచారు.
Elon Musk
richest man
2021
highest paid
ceo

More Telugu News