Indian Premier League: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఐపీఎల్ జెర్సీ

 Indian Premier League enters the Guinness Book of World Records with the largest cricket jersey
  • అతిపెద్ద జెర్సీని రూపొందించి ప్రదర్శించిన ఐపీఎల్
  • 66 X 44 మీటర్ల సైజుతో జెర్సీ తయారీ
  • మ్యాచ్ కు ముందు నరేంద్రమోదీ స్టేడియంలో ప్రదర్శన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ (2022) ముగిసింది. సీజన్ కు ముందు ఎవరూ గుజరాత్ జట్టు టైటిల్ విజేతగా నిలుస్తుందని ఊహించి ఉండరు. అంచనాల్లేకుండా అడుగు పెట్టి.. అద్భుత ఆటతీరుతో గుజరాత్ జట్టు కప్ ఎగరేసుకుపోయింది. అయితే, ఫైనల్ మ్యాచ్ జరిగిన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అతిపెద్ద క్రికెట్ జెర్సీ (పైన ధరించే వస్త్రం, టీషర్ట్)ని ప్రదర్శించారు.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జెర్సీ అని మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ప్రకటించారు. 66 X 44 మీటర్ల సైజుతో ఈ జెర్సీని రూపొందించడం నిజంగా విశేషమే. అందుకే అతిపెద్ద క్రికెట్ జెర్సీగా దీనిని గిన్నిస్ వరల్డ్ రికార్డు వరించింది. ఈ జెర్సీలో పది జట్ల లోగోలను ప్రింట్ గా వేశారు. అలాగే, 15వ సీజన్ ను ప్రతిఫలిస్తూ జెర్సీపై 15వ నంబర్ వేశారు. నరేంద్రమోదీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అని తెలిసిందే. ఇందులో 1,32,000 మంది కూర్చుని వీక్షించే వసతి ఉంది.
Indian Premier League
Guinness Book of World Records
largest cricket jersey

More Telugu News