జులై 4న భీమవరానికి ప్రధాని.. మన్యం వీరుడి జయంతి ఉత్సవాలకు హాజరు

29-05-2022 Sun 08:03
  • జూన్ 7న రాజమహేంద్రవరంలో బీజేపీ బహిరంగ సభ
  • హాజరు కానున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
  • వెల్లడించిన సోము వీర్రాజు
PM Modi to visit Bhimavaram on july 4th
ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జులై 4న పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం రానున్నారు. ఈ మేరకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. నిన్న ఆకివీడులో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. 

జూన్ 7న రాజమహేంద్రవరంలో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా పాల్గొంటారని తెలిపారు. అలాగే, జులై 4న భీమవరంలో నిర్వహించనున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొంటారని సోము వీర్రాజు తెలిపారు.