ఎన్టీఆర్ జ‌యంతిపై బీజేపీ నేత సునీల్ దేవ‌ధ‌ర్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

28-05-2022 Sat 19:50
  • కాంగ్రెస్ ముక్త ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు బీజం వేసింది ఎన్టీఆరేనన్న దేవధర్ 
  • పౌరాణిక పాత్రలలో ప్రాణం నిలిపిన మహా నటుడు అంటూ కితాబు 
  • ఎన్టీఆర్‌కు 99వ జ‌యంతి వేడుక‌ల శుభాకాంక్ష‌ల‌న్న సునీల్‌
sunil deodhar interesting tweet on ntr jayanthi
టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క రామారావు శ‌త జ‌యంతి వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని పార్టీల‌క‌తీతంగా ఆయ‌నను స్మ‌రించుకుంటూ నేత‌లు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. అందులో భాగంగా బీజేపీకి చెందిన ఏపీ శాఖ ఇంచార్జీ సునీల్ దేవ‌ధ‌ర్ కూడా శ‌నివారం ఎన్టీఆర్‌కు జ‌యంతి శుభాకాంక్ష‌లు చెబుతూ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఎన్టీఆర్ సినీ, రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ఆయ‌న ప్ర‌స్తావిస్తూ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. 

ఎన్టీఆర్‌ను కదిలే బొమ్మలతో కోట్లాది మంది హృదయాలను జయించిన నట సార్వభౌముడిగా అభివ‌ర్ణించిన సునీల్‌.. పౌరాణిక పాత్రలలో ప్రాణం నిలిపిన మహా నటుడుగానూ పేర్కొన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహోన్నత వ్యక్తిగా ఎన్టీఆర్‌ను చెప్పిన సునీల్‌.. కాంగ్రెస్ ముక్త ఆంధ్రప్రదేశ్‌కు బీజం నాటిన నాయకుడిగా అభివ‌ర్ణించారు. చివర్లో తారకరామారావు గారికి 99 వ జయంతి వేడుక‌లుగా చెబుతూ గ్రీటింగ్స్ చెప్పారు.