'అంటే .. సుందరానికీ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు!

28-05-2022 Sat 17:04
  • నాని తాజా చిత్రంగా రూపొందిన 'అంటే .. సుందరానికీ'
  • ఈ సినిమాతో టాలీవుడ్ కీ నజ్రియా పరిచయం 
  • విభిన్న స్వభావాల మధ్య నడిచే ప్రేమకథ 
  • జూన్ 10వ తేదీన థియేటర్లకు రానున్న సినిమా
Ante Sundaraniki movie update
నాని హీరోగా వివేక్ ఆత్రేయ 'అంటే .. సుందరానికీ' సినిమాను రూపొందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాతో, తెలుగు తెరకి నజ్రీయా కథానాయికగా పరిచయమవుతోంది. తమిళ .. మలయాళ భాషల్లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఆమె, తెలుగులో చేస్తున్న ఫస్టు మూవీ ఇది. 

వివేక్ సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ అందరిలో ఆసక్తిని పెంచాయి. విలేజ్ లో పెరిగిన ఓ బ్రాహ్మణ యువకుడు.. ఫారిన్ లో పెరిగిన క్రిస్టియన్ యువతి కలిసి చేసే ప్రేమ ప్రయాణమే ఈ సినిమా. 

ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి డేట్ .. టైమ్ ఖరారు చేశారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు  ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ  భాషల్లో వచ్చేనెల 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.