ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు... చెన్నై శివార్లలో కలకలం

28-05-2022 Sat 16:58
  • పోళిచాలూర్ లో ఘటన
  • ఈ ఉదయం నాలుగు శవాలను గుర్తించిన వైనం
  • మృతుల్లో ఇద్దరు పిల్లలు
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Four dead bodies found in a house in Chennai suburban
ఒకే ఇంట్లో నాలుగు మృతదేహాలు వెలుగు చూడడం చెన్నై నగర శివార్లలో తీవ్ర కలకలం రేపింది. పోళిచాలూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ మృతదేహాలు ఉన్నట్టు ఈ ఉదయం వెల్లడైంది. వాటిని ఓ పురుషుడు, స్త్రీ, ఇద్దరు పిల్లల శవాలుగా గుర్తించారు. 

ఆ కుటుంబ యజమాని మొదట తన భార్యను చంపి, ఆపై పిల్లలను కడతేర్చి, చివరగా తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. వ్యాపారంలో నష్టపోయి, ఆర్థికపరమైన సమస్యలతోనే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబం ఆత్మహత్య నేపథ్యంలో పోళిచాలూర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.