మంచి డిజైన్ సూచించండి.. ప్రైజ్ అందుకోండి: సజ్జనార్

28-05-2022 Sat 16:52
  • వాటర్ బాటిళ్లను తయారు చేసి, విక్రయించనున్న ఆర్టీసీ
  • బెస్ట్ టైటిల్, డిజైన్ సూచించాలన్న సజ్జనార్
  • సూచనలను వాట్సాప్ నంబర్ 94409 70000కి పంపాలని విన్నపం
Sajjanar asks passengers to suggest title and design for water bottles
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి ఐపీఎస్ అధికారి సజ్జనార్ వినూత్నమైన ఆఫర్లను ప్రకటిస్తూ సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీని ప్రయాణికులకు మరింత చేరువ చేసేందుకు ఎన్నో చర్యలను చేపట్టారు. తాజాగా ఆయన మరో ఆఫర్ ప్రకటించారు. 

ప్రయాణికులకు వాటర్ బాటిళ్లను తయారు చేసి, విక్రయించేందుకు ఆర్టీసీ సిద్ధమయింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా సజ్జనార్ తెలుపుతూ... వాటర్ బాటిళ్లకు మంచి టైటిల్, డిజైన్ సూచించాలని కోరారు. ఎవరైతే బెస్ట్ డిజైన్ పంపుతారో వారికి ప్రైజ్ ఇస్తామని చెప్పారు. ఆర్టీసీ చేస్తున్న చారిత్రాత్మక మార్పుకు మీ తోడ్పాటును ఇవ్వాలని, తద్వారా చరిత్రలో నిలిచిపోవాలని సజ్జనార్ చెప్పారు. ప్రయాణికుల కోసం 500 ఎంఎల్, 1 లీటర్ వాటర్ బాటిళ్ల ఉత్పత్తిని ప్రారంభించబోతున్నట్టు ఆయన తెలిపారు. మీ సూచనలను తమ వాట్సాప్ నంబర్ 94409 70000కి పంపాలని కోరారు.