వాళ్లిద్దరూ నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు: రామ్ గోపాల్ వర్మ

28-05-2022 Sat 14:53
  • పంజాగుట్ట పోలీసులకు ఆర్జీవీ ఫిర్యాదు
  • నట్టి క్రాంతి, నట్టి కరుణ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న వర్మ
  • వారికి తాను డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్టు సృష్టించారని ఆరోపణ
Ram Gopal Varma complains to police about his signature forgery
తన సంతకాన్ని నట్టి క్రాంతి, నట్టి కరుణ ఫోర్జరీ చేశారంటూ ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆయన సీఐ నిరంజన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. 'మా ఇష్టం' సినిమా షూటింగ్ సమయంలో సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెప్పారు. 

2020 నవంబర్ 30న తన లెటర్ హెడ్ తీసుకున్నారని... ఆ తర్వాత నకిలీ పత్రాలను సృష్టించి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని తెలిపారు. వారికి తాను డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్టు సృష్టించారని చెప్పారు. ఈ సంతకాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి వాస్తవాలను తేల్చాలని కోరారు. తన సినిమా ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉందని... కానీ నకిలీ పత్రాలతో కేసులు వేసి సినిమా విడుదలను అడ్డుకున్నారని ఆరోపించారు.