Chiranjeevi: ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి: చిరంజీవి

Chiranjeevi pays tributes to NTR
  • నేడు ఎన్టీఆర్ శత జయంతి
  • ఘన నివాళి అర్పించిన సినీ, రాజకీయ ప్రముఖులు
  • తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు అంటూ కొనియాడిన చిరంజీవి
టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, నటరత్న ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలు ఆయనను స్మరించుకున్నాయి. ఆయనకు ప్రతి ఒక్కరూ ఘన నివాళి అర్పిస్తున్నారు. ప్రముఖులు ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. 

ట్విట్టర్ ద్వారా చిరంజీవి స్పందిస్తూ... 'తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు, నవరస నటనా సార్వభౌముడు, తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి!' అంటూ ట్వీట్ చేశారు. #100YearsOfNTR అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.
Chiranjeevi
NTR
Tollywood

More Telugu News