Tollywood: వెంకీ, వరుణ్ తేజ్ ల కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫస్డ్ డే కలెక్షన్స్.. ‘ఎఫ్3’ తొలిరోజు వసూళ్లివీ...!

Record First Day Collections in the history of Venky and Varuntej
  • తెలుగు రాష్ట్రాల్లో రూ.10.37 కోట్ల షేర్
  • నైజాంలో అత్యధికంగా రూ.4.06 కోట్లు
  • సీడెడ్ లో రూ.1.26 కోట్ల వసూళ్లు
వెంకీ, వరుణ్ తేజ్ లు తమ సినీ కెరీర్ లోనే రికార్డ్ సెట్ చేసుకున్నారు. థియేటర్లలో కాస్త ఫన్.. కాస్త ఫ్రస్ట్రేషన్ తో తమ చరిత్రలోనే వసూళ్ల సునామీని సృష్టించారు. ఎఫ్ 3 సినిమా తెలంగాణ, ఏపీల్లో తొలిరోజు భారీ వసూళ్లను రాబట్టింది. నైజాంలో రూ.4.06 కోట్లు షేర్ వసూల్ కాగా.. యూఏలో రూ.1.18 కోట్లు, గుంటూరులో రూ.88 లక్షలు, నెల్లూరులో రూ.62 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.76 లక్షలు, పశ్చిమగోదావరిలో రూ.94 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.67 లక్షలు, సీడెడ్ లో రూ.1.26 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. 

మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్ 3 తొలిరోజు రూ.10.37 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. వెంకటేశ్, వరుణ్ తేజ్ లకు వారి కెరీర్ లో ఇదే అత్యధిక తొలి రోజు వసూళ్లు కావడం విశేషం.  
Tollywood
Venkatesh Daggubati
Varun Tej
F3

More Telugu News