RCB: ఒక్క ట్వీట్ తో ఎన్నో హృదయాలను టచ్ చేసిన ఆర్సీబీ

RCB win hearts with touching Shane Warne tweet after RR reach IPL 2022 final
  • రాజస్థాన్ గెలుపును అభినందించిన ఆర్సీబీ
  • ఈ రాత్రి గొప్పగా ఆడారంటూ ప్రశంస
  • ఫైనల్స్ లో అంతా మంచే జరగాలంటూ ట్వీట్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు (ఆర్సీబీ) ఐపీఎల్ 2022 ఫైనల్స్ వెళ్లలేకపోయింది. రాజస్థాన్ జట్టు అన్ని విభాగాల్లో చేసిన మెరుగైన ప్రదర్శన ముందు తలవంచి ఐపీఎల్ టైటిల్ పోరు నుంచి శుక్రవారం నిష్క్రమించింది. ఆట అన్న తర్వాత ఒకరు ఓడడం, ఒకరు గెలవడం జరగాల్సిందే. ఓడినా, గెలిచినా క్రీడాస్ఫూర్తి మరవకూడదు. బెంగళూరు జట్టు కూడా ఇదే నిరూపించింది. రాజస్థాన్ రాయల్స్ కు మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్పింది.

ఈ సందర్భంగా ఆర్సీబీ చేసిన ఒక ట్వీట్ ఎంతో మంది హృదయాలను తాకిందని చెప్పుకోవాలి. ‘‘గొప్ప క్రికెటర్, దివంగత షేన్ వార్న్ మిమ్మల్ని చూసి చిరునవ్వు చిందిస్తున్నాడు. ఈ రాత్రి మీరు గొప్పగా ఆడారు. ఫైనల్ లో  మీకు అంతా మంచే జరగాలి’’ అంటూ ఆర్సీబీ ట్విట్టర్ లో ట్వీట్ పెట్టింది. 

దీనికి రాజస్థాన్ జట్టు హార్ట్ ఎమోజీలతో మౌనంగా సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఐపీఎల్ మొదలు పెట్టిన ఏడాదే టైటిల్ గెలిచిన జట్టు రాజస్థాన్. అది కూడా షేన్ వార్న్ సారథ్యంలో. ఫైనల్స్ లో రాజస్థాన్ విజయం సాధిస్తే అది నిజంగా షేన్ వార్న్ కు గొప్ప నివాళి అవుతుందన్నది అభిమానుల అభిప్రాయం. 

‘‘షేన్ వార్న్ రాజస్థాన్ రాయల్స్ ను ప్రభావితం చేయగల వ్యక్తి. మొదటి సీజన్ (2008)లో జట్టును విజయవంతంగా నడిపించాడు. మేము హృదయ పూర్వకంగా అతన్ని మిస్సవుతున్నాం. కానీ, ఈ రోజు పై నుంచి మమ్మల్ని చూసి ఎంతో గర్వపడి ఉంటాడు’’ అని రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించడం గమనార్హం.
RCB
tweet
Shane Warne
RR
heart touching

More Telugu News