అందుకే శ్రీనిధి శెట్టి జోరు కనిపించడం లేదట!

  • గ్లామరస్ హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి 
  • 'కేజీఎఫ్ 2'తో మరింత పెరిగిపోయిన క్రేజ్ 
  • తమిళంలో ఆమె చేసిన 'కోబ్రా' త్వరలోనే విడుదల 
  • భారీగా పారితోషికం పెంచేసిందంటూ టాక్ 
Srinidhi Shetti KGF 3 Movie Update

కాలేజ్ రోజుల్లోనే అందగత్తెగా శ్రీనిధి శెట్టి అనేక బహుమతులు గెలుచుకుంది. ఆ తరువాత మోడల్ గా బిజీ అయింది. మోడల్ గా ఆమె పోస్టర్స్ బయటికి రావడంతో 'కేజీఎఫ్' సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాతో ఆమెకి ఒక రేంజ్ లో గుర్తింపు వచ్చింది. మంచి హైటూ .. అందుకు తగిన పర్సనాలిటీ శ్రీనిధి సొంతం. 

చక్కని కనుముక్కుతీరుతో .. ఆకర్షణీయమైన రూపంతో కుర్రాళ్లను ఆమె ఇట్టే ఆకట్టుకుంటుంది. 'కేజీఎఫ్ 2' కూడా వసూళ్ల వర్షాన్ని కురిపించడంతో, సహజంగానే ఈ బ్యూటీ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గ్లామర్ పరంగా ఈ సినిమా ఆమె క్రేజ్ ను మరింతగా పెంచేసింది. దాంతో ఆమె తన డిమాండ్ కి తగిన పారితోషికాన్ని అడుగుతోందట.

ప్రస్తుతం సౌత్ లోని స్టార్ హీరోయిన్స్ తీసుకునేదానికంటే ఎక్కువగా ఆమె డిమాండ్ చేస్తుందని అంటున్నారు. అందువల్లనే మేకర్స్ ఆలోచన చేస్తున్నారట. శ్రీనిధి తదుపరి సినిమాగా తమిళంలో రూపొందిన 'కోబ్రా' .. ఆ ఆగస్టు 11వ తేదీన  పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమా కూడా హిట్ అయినా .. 'కేజీఎఫ్ 3' సెట్స్ పైకి వెళ్లినా ఇక అమ్మడిని పట్టుకోవడం కష్టమనే అంటున్నారు.

More Telugu News