అమెరికాలో రేవంత్ రెడ్డి!.. జీన్స్, టీషర్ట్‌లో కనిపించిన టీపీసీసీ చీఫ్!
- న్యూయార్క్ చేరుకున్న రేవంత్ రెడ్డి
- ఘనంగా స్వాగతం పలికిన తెలంగాణ ఓవర్సీస్ కాంగ్రెస్ నేతలు
- తన పాత లుక్కులో ఆకట్టుకున్న రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి జీన్స్ ప్యాంట్, టీ షర్ట్‌లో స్టయిలిష్ గా కనిపించారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలి నాళ్లలో జీన్స్, టీషర్ట్‌తో ఓ దఫా అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన ఆయన ఫొటోలు నాడు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా టూర్‌లో రేవంత్ రెడ్డి తన పాత లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.