జ్యూరిచ్ వీధుల్లో దర్జాగా... కేటీఆర్ ఫొటోలు ఇవిగో!

27-05-2022 Fri 20:38
  • దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు
  • తెలంగాణకు గణనీయస్థాయిలో పెట్టుబడులు
  • పర్యటన పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కేటీఆర్
  • హైదరాబాద్ కు తిరుగుపయనం
  • జ్యూరిచ్ లో మధ్యాహ్న భోజనం
KTR haves lunch at a roadside restaurant in Zurich
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో ఆశించిన ఫలితాలు రాబట్టిన తెలంగాణ మంత్రి కేటీఆర్ తిరుగు పయనమయ్యారు. తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు రాబట్టడంలో సఫలమైన కేటీఆర్ తన పర్యటన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. "అడియోస్ దావోస్"... అంటూ స్పానిష్ భాషలో వీడ్కోలు పలికారు. "మళ్లీ వచ్చేంత వరకు... గుడ్ బై దావోస్" అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. 

కాగా, దావోస్ నుంచి తిరిగి వచ్చే క్రమంలో జూరిచ్ వీధుల్లో కేటీఆర్ విహరించారు. అక్కడ రోడ్డు పక్కన ఉన్న ఓ రెస్టారెంట్ లో మధ్యాహ్న భోజనం చేశారు. వాతావరణం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. రెస్టారెంట్ వద్ద తాను ఠీవీగా కూర్చుని ఉన్నప్పటి ఫొటోలను కూడా కేటీఆర్ పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలకు విశేష రీతిలో స్పందన లభిస్తోంది.
.