Shikhar Dhawan: ఐపీఎల్ నుంచి పంజాబ్ కింగ్స్ నిష్క్రమించడంతో ధావన్ ను కిందపడేసి తన్నిన తండ్రి.. వైరల్ వీడియో ఇదిగో!

Dhawan shares a video of his father beating him after PBKS failed to reach IPL Play Offs
  • ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ చేరలేకపోయిన పంజాబ్ కింగ్స్
  • ఫన్నీ వీడియో పంచుకున్న ధావన్
  • కామెడీగా తండ్రి చేతిలో దెబ్బలు తిన్న వైనం
ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ లీగ్ దశలోనే నిష్క్రమించడం తెలిసిందే. భారత సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ పంజాబ్ కింగ్స్ జట్టులో సభ్యుడు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ధావన్ అప్పుడప్పుడు ఫన్నీగా ఉండే వీడియోలను అభిమానులతో పంచుకుంటాడు. తాజాగా, ధావన్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో అందరినీ కడుపుబ్బా నవ్విస్తోంది. ఆ వీడియోలో... ధావన్ ను తండ్రి కిందపడేసి కొడుతున్న దృశ్యాలు ఉన్నాయి.

ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ కు చేరడంలో పంజాబ్ కింగ్స్ విఫలమైన నేపథ్యంలో ఆయన ధావన్ ను కామెడీగా ఆ విధంగా కొట్టాడట. ఇతర కుటుంబ సభ్యులు కూడా చూస్తుండగా, ధావన్ కిందపడిపోయి మరీ తండ్రి చేతిలో తన్నులు తినడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ధావన్ ఐపీఎల్ తాజా టోర్నీలో ఫర్వాలేదనిపించేలా రాణించాడు. 14 మ్యాచ్ లు ఆడిన ధావన్ 38.3 సగటుతో 460 పరుగులు సాధించాడు.
Shikhar Dhawan
Father
Video
PBKS
Play Offs
IPL

More Telugu News