గో బ్యాక్ మోదీ!... ఇదే నేటి ట్రెండింగ్ అంటున్న మాణిక్కం ఠాగూర్‌!

26-05-2022 Thu 21:02
  • ద‌క్షిణాది రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌లో మోదీ
  • టాప్ ట్రెండింగ్‌లో గో బ్యాక్ మోదీ నినాదం
  • ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించిన మాణిక్కం ఠాగూర్‌
manickam tagore said go back modi is top trending news
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ గురువారం ద‌క్షిణాది రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తొలుత తెలంగాణ రాజ‌ధాని హైదరాబాద్‌లో ప‌ర్య‌టించిన మోదీ... ఆ త‌ర్వాత త‌మిళ‌నాడు రాజ‌దాని చెన్నైకి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మోదీ గో బ్యాక్ అంటూ ఇరు రాష్ట్రాల‌కు చెందిన యువ‌త పెద్ద ఎత్తున నిన‌దిస్తోంద‌ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్య‌వ‌హారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ వ్యాఖ్యానించారు.  

ఈ మేర‌కు టాప్ ట్రెండింగ్ అంశాల్లోనే మోదీ గో బ్యాక్ అన్న నినాదమే టాప్ పొజిష‌న్‌లో నిలిచింద‌ని కూడా ఠాగూర్ పేర్కొన్నారు. ఈ మేర‌కు ట్రెండింగ్ అవుతున్న అంశాల జాబితాను స్క్రీన్ షాట్ తీసిన ఠాగూర్ దానిని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. మోదీ ద‌క్షిణాది రాష్ట్రాల ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఈ నినాదం వినిపిస్తోందంటే ఏదో ప్ర‌త్యేక‌తే ఉందంటూ ఠాగూర్ సెటైర్ సంధించారు. 
.