హైద‌రాబాద్ ఫ్లై ఓవ‌ర్ల‌పై వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు

26-05-2022 Thu 20:34
  • ఫ్లై ఓవ‌ర్ల‌పై వేగ ప‌రిమితి గంట‌కు 80 కిలో మీటర్ల‌కు పెంపు
  • విద్యాల‌యాలు ఉన్న చోట గంట‌కు 40 కిలో మీట‌ర్లే
  • పీవీ ఎక్స్‌ప్రెస్ వే స‌హా అన్ని ఫ్లై ఓవ‌ర్లకు ఇవే నిబంధ‌న‌లు
vehicles speed limit hike on fly overs in hyderabad
గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ) ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితిని పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న మ‌రునాడే హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు గురువారం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. హైద‌రాబాద్ ప‌రిధిలోని అన్ని ఫ్లై ఓవ‌ర్ల‌పై వాహ‌నాల వేగాన్ని పెంచుతూ పోలీసులు నిర్ణ‌యం తీసుకున్నారు. 

హైద‌రాబాద్‌లోని ఫ్లై ఓవ‌ర్ల‌పై ఇక నుంచి అన్ని ర‌కాల వాహ‌నాలు గంట‌కు 80 కిలో మీట‌ర్ల వేగంతో వెళ్ల‌వ‌చ్చ‌ని పోలీసులు ప్ర‌క‌టించారు. అయితే విద్యాల‌యాలు ఉన్న చోట మాత్రం వాహ‌నాల వేగం గంట‌కు 40 కిలో మీటర్ల‌కు మించ‌రాద‌ని ఆదేశాలు జారీ చేశారు. పీవీ ఎక్స్‌ప్రెస్ వే స‌హా న‌గ‌రంలోని అన్ని ఫ్లై ఓవ‌ర్ల‌కు ఇవే నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయ‌ని పోలీసులు ప్ర‌క‌టించారు.