వైసీపీలోకి వెళ్లిన వాళ్లంతా త్వరలోనే టీడీపీలోకి వస్తారు: మాగంటి బాబు

26-05-2022 Thu 12:22
  • రాష్ట్రాన్ని జగన్ అగ్నిగుండంలా మార్చారన్న మాగంటి 
  • ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని వ్యాఖ్య 
  • మహానాడుతో రాష్ట్ర ప్రజలకు శుభ సమయం ప్రారంభం కాబోతోందన్న మాగంటి బాబు 
All who joined YSRCP will return back to TDP says Maganti Babu
టీడీపీ కీలక నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు గత రెండేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తన ఇద్దరు తనయుల మరణం నేపథ్యంలో మౌనంగా ఉంటున్నారు. తాజాగా ఈరోజు ఆయన మళ్లీ బయట ప్రపంచంలోకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను వైసీపీలోకి వెళ్లనని చెప్పారు. వైసీపీలోకి వెళ్లిన వాళ్లు కూడా త్వరలోనే టీడీపీలోకి తిరిగి వస్తారని అన్నారు. 

ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై ఆయన విమర్శలు గుప్పించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్... రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చారని అన్నారు. ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి ఒనగూరింది ఏమీ లేదని... అక్రమ అరెస్ట్ లు, పోలీసుల దౌర్జన్యాలు, మంత్రుల దుర్భాషలు, ఎమ్మెల్యేల రౌడీయిజమే మిగిలాయని చెప్పారు. మహానాడుతో రాష్ట్ర ప్రజలకు ఒక శుభ సమయం ప్రారంభం కాబోతోందని అన్నారు. ఏలూరు పార్లమెంటు రాజకీయాల్లోనే తాను ఉంటానని చెప్పారు.