Taraka Ratna: బాలకృష్ణ బాబాయ్, తమ్ముడు ఎన్టీఆర్ తో నేను పోల్చుకోను: తారకరత్న

Never compare myself with Balakrishna and Junior NTR says Taraka Ratna
  • వారిలా నటించాలని తాను ఎప్పుడూ అనుకోనన్న తారకరత్న 
  • డైరెక్టర్ తన నుంచి ఆశించిన మేరకు నటిస్తానని వెల్లడి 
  • ఎలాంటి పాత్రను చేయడానికైనా తాను సిద్ధమని వ్యాఖ్య 
నటన విషయంలో బాలకృష్ణ బాబాయ్, తమ్ముడు ఎన్టీఆర్ తో తాను పోల్చుకోనని, వారిలా చేయాలని ఎప్పుడూ అనుకోనని నందమూరి తారకరత్న చెప్పారు. తన స్టయిల్లో తాను నటిస్తానని అన్నారు. డైరెక్టర్ తన నుంచి ఏమి ఆశిస్తారో ఆ మేరకు తాను నటిస్తానని చెప్పారు. డైరెక్టర్ కు ఏం కావాలో అది తనతో చేయించుకుంటారని అన్నారు. 

ఎలాంటి పాత్రలను పోషించడానికైనా తాను సిద్ధమని చెప్పారు. ప్రతి క్యారెక్టర్ ని తాను ఇష్టపడతానని తెలిపారు. డైరెక్టర్ వల్లే తాను గతంలో నంది అవార్డును గెలుచుకున్నానని చెప్పారు. ఒక సినిమా కానీ, వెబ్ సిరీస్ కానీ విజయవంతం కావాలంటే స్క్రిప్ట్ చాలా ముఖ్యమని అన్నారు. '9 అవర్స్' వెబ్ సిరీస్ లో తారకరత్న నటించారు. ఈ సిరీస్ జూన్ 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
Taraka Ratna
Balakrishna
Junior NTR
Tollywood

More Telugu News