మలేసియాకు 'వాల్తేరు వీరయ్య'

25-05-2022 Wed 19:07
  • 'వాల్తేరు వీరయ్య'గా  చిరంజీవి 
  • ఊర మాస్ లుక్ తో కనిపించనున్న మెగాస్టార్ 
  • ఆయన సరసన నాయికగా శ్రుతి హాసన్
  • హైలైట్ గా నిలవనున్న దేవిశ్రీ  పాటలు 
Valtheru Veerayya movie update
చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మత్స్య కారుడిగా .. మత్స్య కారులకు నాయకుడిగా చిరంజీవి కనిపించనున్నారు. 
 
తమ జీవితాలపై పెత్తనం .. తమ మార్కెట్ పై ఆధిపత్యాన్ని ప్రశ్నించే నాయకుడిగా ఈ సినిమాలో చిరంజీవి పోరాటం సాగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను మలేసియాలో చిత్రీకరించనున్నారు. అందువలన ఈ సినిమా టీమ్ అక్కడికి ప్రయాణమవుతున్నట్టు తెలుస్తోంది. 

ఈ సినిమాలో చిరంజీవి లుక్ ఊర మాస్ గా ఉంటుంది. లుంగీ పైకి కట్టి .. తలపాగా చుట్టి .. బీడీ కాల్చుతూ మాస్ ఆడియన్స్ ను మెప్పించనున్నారు. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 'గాడ్ ఫాదర్' తరువాత ఈ సినిమా విడుదల కానుంది.