హరీశ్ శంకర్ తో రామ్ సినిమా!

  • రామ్ తాజా చిత్రంగా రూపొందిన 'ది వారియర్'
  • ఆయన నెక్స్ట్ మూవీ బోయపాటితో 
  • అందుకోసం జరుగుతున్న సన్నాహాలు 
  • లైన్లోనే ఉన్న హరీశ్ శంకర్
Ram  in Harish Shankar movie

టాలీవుడ్ లో మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకులలో హరీశ్ శంకర్ ఒకరిగా కనిపిస్తాడు. మెగా హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన హరీశ్ శంకర్, పవన్ తో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా పేరే 'భవదీయుడు భగత్ సింగ్'. ఈ సినిమా తరువాత ఆయన రామ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

రామ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ది వారియర్' రెడీ అవుతోంది. లింగుసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జులై 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ తరువాత సినిమాను ఆయన బోయపాటి దర్శ కత్వంలో చేయనున్నాడు. రామ్ చేయనున్న ఫస్టు పాన్ ఇండియా సినిమా ఇది.

 పవన్ తో హరీశ్ 'భవదీయుడు భగత్ సింగ్' పూర్తిచేసేలోగా బోయపాటితో రామ్ మూవీ పూర్తవుతుందట. ఆ తరువాత ఈ ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు తెలియనున్నాయి.

More Telugu News