Nagachaitanya: అక్కినేని హీరోనే లైన్లో పెట్టిన 'బొమ్మరిల్లు' భాస్కర్

Chaitu in Bommarillu Bhaskar Movie
  • అఖిల్ కి హిట్ ఇచ్చిన 'బొమ్మరిల్లు' భాస్కర్ 
  • ఆయనతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చైతూ
  • నిర్మాణ సంస్థగా రంగంలోకి 14 రీల్స్  
  • పరశురామ్ తో సినిమా తరువాత పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
చాలా కాలం క్రితం వచ్చిన 'బొమ్మరిల్లు' సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ప్రేమకథా చిత్రాల పరంగా చూసినా .. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాల పరంగా చూసినా ఈ సినిమాకి చెప్పుకోదగిన స్థానం లభించింది. ఆ సినిమా తరువాత 'బొమ్మరిల్లు' భాస్కర్ నుంచి మరి కొన్ని సినిమాలు వచ్చాయి గానీ, ఆ స్థాయి హిట్ పడలేదు.

చాలా గ్యాప్ తరువాత ఆయనకి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాతో సక్సెస్ దొరికింది. కథాకథనాల సంగతి అటుంచితే పూజ హెగ్డే గ్లామర్ ఈ సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించిందనే మాట వినిపించింది. ఏదేమైనా అఖిల్ ఊపిరి పీల్చుకునేలా చేసిన సినిమా ఇది. అఖిల్ కి హిట్ ఇచ్చిన భాస్కర్ ఇప్పుడు చైతూతో చేయడానికి రెడీ అవుతున్నాడనేది తాజా సమాచారం. 

ఇటీవలే చైతూకి భాస్కర్ ఒక కథను వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. 14 రీల్స్ సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు చెబుతున్నారు. ముందుగా పరశురామ్ సినిమాను పూర్తిచేసిన తరువాతనే చైతూ ఈ ప్రాజెక్టు పైకి వెళతాడని సమాచారం.
Nagachaitanya
Bommarillu Bhaskar
Tollywood

More Telugu News