బుగ్గన గారూ... మీ కథలను ఎవరూ నమ్మడంలేదు: వంగలపూడి అనిత

21-05-2022 Sat 16:07
  • సీఎం జగన్ దావోస్ పర్యటన
  • వైసీపీ, టీడీపీ నేతల మధ్య విమర్శలు
  • టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండించిన బుగ్గన
  • మరో బుర్రకథ చెప్పండి అంటూ బుగ్గనకు అనిత కౌంటర్
TDP leader Anitha counters Buggana explanation on CM Jagan Davos tour
సీఎం జగన్ దావోస్ పర్యటన నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య పరస్పర విమర్శల దాడి కొనసాగుతోంది. సీఎం జగన్ పర్యటనపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బదులివ్వడం తెలిసిందే. అయితే, బుగ్గన వివరణపై టీడీపీ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటుగా స్పందించారు. 

32 మంది కమ్మ డీఎస్పీల ప్రమోషన్ అబద్ధం అని అసెంబ్లీలో తేలినప్పటి నుంచి మీ కథలను ప్రజలు ఎవరూ నమ్మడంలేదని బుగ్గనకు అనిత్ కౌంటర్ ఇచ్చారు. గంటకు రూ.12 లక్షలు ఖర్చు పెట్టి కేవలం అర్ధాంగిని మాత్రమే ఎందుకు తీసుకెళ్లాడు జగన్ రెడ్డి? అంటూ అనిత ప్రశ్నించారు. దీనికి కూడా ఓ బుర్ర కథ చెప్పండి బుగ్గన గారూ! అంటూ ఎద్దేవా చేశారు. తోటి మంత్రులు, అధికారులను వెంటబెట్టుకుని వెళ్లలేదేం...? అంటూ నిలదీశారు.