Avanthi Srinivas: అవంతి శ్రీనివాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్రాహ్మణ సంక్షేమ వేదిక

Brahmana Sankhsema Vedika complaints on Avanthi Srinivas to police
  • ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ ను అవంతి కులం పేరుతో దూషించారన్న బ్రాహ్మణులు
  • పంతులు నీ సంగతి చూస్తానని బెదిరించారని ఆగ్రహం
  • అవంతిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు
ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుపై విశాఖ పోలీసులకు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే రైతు భరోసా కవరేజ్ కు వెళ్లిన ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ ను ఉద్దేశించి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు బ్రాహ్మణులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. 'పంతులు.. నీ సంగతి చూస్తా' అని అవంతి బెదిరించారు. ఈ నేపథ్యంలో తమ కులం పేరుతో రిపోర్టర్ ను దూషించారంటూ పోలీసులకు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఫిర్యాదు చేసింది. ఐపీసీ 153 (సీ), 509 (ఏ) ప్రకారం మాజీ మంత్రి అవంతిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Avanthi Srinivas
YSRCP
Brahmins
Vizag
Channel Reporter

More Telugu News