ప్రభాస్, అనుష్కల పెళ్లి తర్వాత నేను చేసుకుంటా: అడివి శేష్

21-05-2022 Sat 11:43
  • 'మేజర్' సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న అడివి శేష్
  • పెళ్లి ఎప్పుడు చేసుకుంటారంటూ ప్రమోషన్ కార్యక్రమంలో ఎదురైన ప్రశ్న
  • ప్రభాస్, అనుష్క ఇంకా పెళ్లి చేసుకోలేదని సమాధానమిచ్చిన వైనం
Will marry after Prabhas and Anushka marriage says Adivi Sesh
టాలీవుడ్ లో పెళ్లి చేసుకోకుండా ఇంకా బ్యాచిలర్ లైఫ్ గడుపుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే గత రెండేళ్ల కాలంలో చాలామంది పెళ్లిపీటలు ఎక్కారు. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. రెండ్రోజుల క్రితమే హీరో ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కీ గల్రానీని పెళ్లాడాడు. మరోవైపు తన తాజా చిత్రం 'మేజర్' ప్రమోషన్లలో హీరో అడివి శేష్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

తాజాగా ప్రమోషన్ కార్యక్రమంలో అడివి శేష్ కు పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురయింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఆయనను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శేష్ ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చాడు. ఇండస్ట్రీలో పెళ్లి కావాల్సిన వాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారు. తన స్నేహితులు ప్రభాస్, అనుష్క కూడా పెళ్లి చేసుకోలేదని... వాళ్లిద్దరి పెళ్లి అయిపోయిన తర్వాత తాను చేసుకుంటానని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో మరోసారి ప్రభాస్, అనుష్కల పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని, తమ మధ్య అంతకు మించి ఎలాంటి రిలేషన్ లేదని ప్రభాస్, అనుష్క గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే శేష్ వ్యాఖ్యలతో మరోసారి చర్చ మొదలయింది.