వేదాంత గ్రూప్ చైర్మ‌న్ అనిల్ అగ‌ర్వాల్‌తో కేటీఆర్ భేటీ

20-05-2022 Fri 19:33
  • లండ‌న్ టూర్‌లో కేటీఆర్‌
  • వేదాంత చైర్మ‌న్‌తో భేటీ
  • తెలంగాణ‌లో పెట్టుబ‌డుల‌పై చ‌ర్చ‌
  • హైద‌రాబాద్ రావాలంటూ అనిల్ ‌కు కేటీఆర్ ఆహ్వానం
ktr meets vedanta group chairman Anil Agarwal in london
లండ‌న్ టూర్‌లో ఉన్న తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్ దిగ్గ‌జ పారిశ్రామిక సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తూ బిజీబిజీగా గ‌డుపుతున్నారు. ఇందులో భాగంగా శ‌నివారం ఆయ‌న వేదాంత గ్రూప్ చైర్మ‌న్ అనిల్ అగ‌ర్వాల్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు అనిల్ అగ‌ర్వాల్‌తో తాను క‌లిసి దిగిన ఫొటోను కేటీఆర్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

ఈ భేటీలో భాగంగా తెలంగాణ‌లో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు సంబంధించి అందుబాటులో ఉన్న మౌలిక వ‌స‌తులు, ప్రోత్సాహ‌కాల‌పై అనిల్ అగ‌ర్వాల్‌తో చ‌ర్చించిన‌ట్లు కేటీఆర్ తెలిపారు. అంతేకాకుండా వేదాంత కంపెనీని తెలంగాణ‌లో విస్త‌రించాల‌ని కూడా కోరిన‌ట్లు తెలిపారు. హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు రావాల్సిందిగా కూడా అనిల్ అగ‌ర్వాల్‌ను ఆహ్వానించిన‌ట్లు కేటీఆర్ తెలిపారు.