తెలంగాణ ఉద్యమానికి పాటలే ప్రాణమని యాది మరిస్తివా కేసీఆర్?: రేవంత్ రెడ్డి

20-05-2022 Fri 18:48
  • కేసీఆర్ తీరును ప్ర‌శ్నిస్తూ న‌ర‌సింహ‌ పాడిన పాట  
  • అదే పాట‌ను పోస్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి ట్వీట్‌
  • అరాచ‌కాల‌ను ప్ర‌శ్నించేందుకు గొంతెత్తూనే ఉంటామ‌ని వెల్ల‌డి
revanth reddy tweet on a song which questions kcr regime
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్ర‌శ్నిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్ర‌వారం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. అందులో కేసీఆర్ స‌ర్కారు తీరును ప్ర‌శ్నిస్తూ తెలంగాణ‌కు చెందిన న‌ర‌సింహ అనే గాయ‌కుడు పాడిన పాట‌ను ఆయ‌న త‌న ట్వీట్‌కు జ‌త చేశారు. తెలంగాణ ఉద్య‌మానికి పాట‌లే ప్రాణ‌మ‌ని యాది మ‌రిస్తివా కేసీఆర్ అంటూ ఆయ‌న ఓ కామెంట్ కూడా త‌న ట్వీట్‌కు యాడ్ చేశారు. 

పాట‌తో మిమ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తున్నందుకు కేసులు పెట్టి అణ‌చివేస్తారా? అంటూ ప్ర‌శ్నించిన రేవంత్ రెడ్డి, ఆ త‌రహా వేధింపుల‌కు తాము భ‌య‌ప‌డ‌బోమ‌ని వెల్ల‌డించారు. అంతేకాకుండా మీ అరాచ‌కాల‌ను ప్ర‌శ్నించేందుకు గొంతెత్తూనే ఉంటామ‌ని కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ తీరును ప్ర‌శ్నిస్తూ పాట పాడిన న‌ర‌సింహ‌తో పాటు మ‌హిపాల్‌కు తాము అండ‌గా ఉంటామ‌ని రేవంత్ ప్ర‌క‌టించారు. అరెస్ట్ మీ కేసీఆర్ అన్న ఓ హ్యాష్‌ట్యాగ్‌ను కూడా రేవంత్ త‌న ట్వీట్‌కు యాడ్ చేశారు.