అడవి అన్నాక అన్నీ వేటకి వెళతాయి .. 'విక్రమ్' నుంచి ట్రైలర్ రిలీజ్!

20-05-2022 Fri 17:42
  • 'విక్రమ్'గా విభిన్నమైన పాత్రలో కమలహాసన్ 
  • సొంత బ్యానర్లో రూపొందిన యాక్షన్ మూవీ ఇది 
  • ముఖ్యమైన పాత్రలను పోషించిన ఫహాద్, విజయ్ సేతుపతి 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
Vikram movie trailar released
ప్రయోగాత్మక కథలను ..  పాత్రలను ఎంచుకోవడంలో కమల్ ఎప్పుడూ ముందుంటారు. అలాంటి ఒక కథతోనే ఆయన ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. లుక్ పరంగా .. క్యారెక్టరైజేషన్ పరంగా కమల్  కొత్తగా కనిపిస్తున్న ఆ సినిమా పేరే 'విక్రమ్'. ఆయన సొంత బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమైంది. 

ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. 'ఖైదీ' .. ' మాస్టర్' సినిమాలతో మంచి మార్కులు కొట్టేసిన ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. కాన్సెప్ట్ వీడియోతోనే ఈ సినిమాపై ఆయన ఆ ఆసక్తిని పెంచేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

"అడవి అన్నాక సింహం .. పులి .. చిరుత అన్నీ వేటకి వెళతాయి .. జింక తప్పించుకోవాలని చూస్తుంది. ఆ లోపు సూర్యాస్తమయం అయితే, సూర్యోదయాన్ని చూడబోయేదెవరనేది ప్రకృతి నిర్ణయిస్తుంది" అంటూ కమల్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతోంది. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.