Janasena: ఇటీవల మరణించిన జ‌న‌సైనికుడి కుటుంబానికి రూ.5 ల‌క్ష‌ల బీమా ప‌రిహారాన్ని అందించిన ప‌వ‌న్

pawan kalyan hand over 5 lack cheque to saidulu family
  • ఇటీవ‌లే రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయిన సైదులు
  • సైదులు కుటుంబాన్ని స్వ‌యంగా ప‌రామ‌ర్శించిన ప‌వన్‌
  • పిల్ల‌ల చ‌దువు, ఆరోగ్యం బాధ్య‌త పార్టీ చూసుకుంటుంద‌ని పవన్ హామీ   
రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయిన జ‌న‌సేన క్రియాశీల స‌భ్యుడి కుటుంబానికి ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ రూ.5 ల‌క్ష‌ల బీమా ప‌రిహారాన్ని అందించారు. ఉమ్మ‌డి న‌ల్లొండ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈ మేర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ బీమా ప‌రిహారం చెక్కును బాధిత కుటుంబానికి అంద‌జేశారు. 

శుక్రవారం ఉమ్మ‌డి న‌ల్లొండ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ప‌వ‌న్‌... ఇటీవ‌లే రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయిన గోప‌రాజుప‌ల్లికి చెందిన‌ పార్టీ స‌భ్యుడు కొంగ‌రి సైదులు ఇంటికి వెళ్లారు. సైదులు భార్య సుమ‌తిని ఆయ‌న ఓదార్చారు. రోడ్డు ప్ర‌మాదంలో సైదులు కుమారుడు కూడా గాయ‌ప‌డ్డార‌న్న విష‌యం తెలుసుకున్న ప‌వ‌న్‌... అత‌డి ఆరోగ్య ప‌రిస్థితిపై వాక‌బు చేశారు. 

ఈ సంద‌ర్భంగా పార్టీ అండ‌గా ఉంటుంద‌ని సైదులు భార్యకు ప‌వ‌న్ భ‌రోసా ఇచ్చారు. బిడ్డల చదువు, ఆరోగ్యం బాధ్యతను కూడా జనసేన పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అనంతరం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు ఇచ్చే రూ.5లక్షల ప్రమాద బీమా చెక్కును కొంగరి సుమతికి అందచేశారు.
Janasena
Pawan Kalyan
Nalgonda District
Telangana

More Telugu News