Road Accident: కలపదుంగల లోడ్ తో వెళుతున్న లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

9 charred to death in Truck and Tanker Collision in Maharashtra
  • మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో ఘోర ప్రమాదం
  • నిన్న రాత్రి 10.30 గంటలకు యాక్సిడెంట్
  • ఢీకొట్టిన వెంటనే చెలరేగిన మంటలు
మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నిన్న రాత్రి 10.30 గంటలకు చంద్రాపూర్–మూల్ మార్గంలోని అజయ్ పూర్ వద్ద ట్రక్కు, లారీ ఢీకొట్టుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 9 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాద వివరాలను పోలీసులు ఇవాళ వెల్లడించారు. 

కలపదుంగల లోడుతో వెళుతున్న లారీని డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టిందని, ఆ వెంటనే మంటలు చెలరేగాయని చంద్రాపూర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సుధీర్ నందార్వర్ చెప్పారు. ఘటన జరిగిన గంట తర్వాత ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చారని పేర్కొన్నారు. కాగా, పూర్తిగా కాలిన మృతదేహాలను చంద్రాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Road Accident
Maharashtra
Crime News

More Telugu News