అదరగొట్టిన హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్... ఆర్సీబీ టార్గెట్ 169 రన్స్

19-05-2022 Thu 21:34
  • ఆర్సీబీకి చావోరేవో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్
  • ఫిఫ్టీ కొట్టిన పాండ్యా
  • ఆఖర్లో రషీద్ మెరుపులు
Hardik Pandya fifty guides Titans respectable score
ఐపీఎల్ లో నేడు గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అర్ధసెంచరీ, రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ సాయంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది.

పాండ్యా 47 బంతుల్లో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పాండ్యా స్కోరులో 4 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. ఆఖర్లో వచ్చిన రషీద్ ఖాన్ చిచ్చరపిడుగులా చెలరేగడంతో గుజరాత్ స్కోరు 150 మార్కు దాటింది. రషీద్ ఖాన్ కేవలం 6 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 19 పరుగులు చేశాడు. 

అంతకుముందు, ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 31, డేవిడ్ మిల్లర్ 34 (3 సిక్సర్లు) పరుగులతో రాణించారు. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (1) విఫలం కాగా, మాథ్యూవేడ్ 16 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో జోష్ హేజెల్ వుడ్ 2, మ్యాక్స్ వెల్ 1, హసరంగ 1 వికెట్ తీశారు.