Adivi Sesh: గుండె ఆగి ఆగి అదురుతున్నది .. 'మేజర్' నుంచి సాంగ్ రిలీజ్

Major Movie Song Released
  • సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్రగా 'మేజర్'
  • ఆయన పాత్రలో నటించిన అడివి శేష్ 
  • మహేశ్ బాబు నిర్మించిన సినిమా ఇది
  • జూన్ 3వ తేదీన థియేటర్లకు రానున్న సినిమా

అడివి శేషు హీరోగా 'మేజర్' సినిమా రూపొందింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్రగా ఈ సినిమా నిర్మితమైంది. మహేశ్ బాబు నిర్మించిన ఈ సినిమాకి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శేష్ జోడీగా సయీ మంజ్రేకర్ అలరించనుంది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకి పరిచయమవుతోంది. 

శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. 'ఓ ఇషా' అంటూ ఈ పాట సాగుతోంది. హీరో హీరోయిన్ల మధ్య పరిచయం .. ప్రేమ .. పెళ్లి .. అతను ఆర్మీలో చేరడం .. ఒకరిని గురించిన ఆలోచనలతో ఒకరు ఉండటం .. ఈ పాటలో చూపించారు. 

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఎలా చనిపోయారనేది అందరికీ తెలుసు .. కానీ ఆయన ఎలా బ్రతికారనేది  కొందరికే తెలుసు .. ఆ కోణాన్ని కూడా ఈ సినిమాలో చూపించడం  జరిగిందని అడివి శేష్ చెప్పిన  దగ్గర నుంచి ఈ సినిమాపై మరింతగా  అంచనాలు పెరుగుతూ వచ్చాయి. జూన్ 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News