వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులు ఖ‌రారు!.. జాబితా ఇదే!

these are the ysrcp candidates for 4 rajyasabha seats
  • వ‌రుస‌గా రెండోసారి రాజ్య‌స‌భ‌కు సాయిరెడ్డి
  • జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త న్యాయవాది నిరంజ‌న్ రెడ్డికి ఛాన్స్‌
  • బీసీ కోటాలో బీద మ‌స్తాన్‌రావు, ఆర్‌.కృష్ణ‌య్య‌ల‌కు అవ‌కాశం
  • వైసీపీ అభ్య‌ర్థిత్వాల‌ను ప్ర‌క‌టించిన మంత్రి బొత్స‌
ఏపీలో త్వ‌ర‌లో ఖాళీ కానున్న 4 రాజ్య‌స‌భ సీట్ల‌కు జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల కోసం అధికార వైసీపీ న‌లుగురు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు తుది జాబితాను సీఎం జ‌గ‌న్ ఖరా‌రు చేయ‌గా... మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ న‌లుగురు అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించారు.

అంతా భావించిన‌ట్లుగానే పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డికి మ‌రోమారు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇచ్చేందుకు వైసీపీ అధిష్ఠానం నిర్ణ‌యించింది. ఇక జ‌గ‌న్‌కు వ్య‌క్తిగ‌త న్యాయ‌వాదిగా కొన‌సాగుతున్న నిరంజ‌న్ రెడ్డికి కూడా ఆ పార్టీ రాజ్య‌స‌భ సీటు ఇచ్చింది. మిగిలిన రెండు స్థానాల‌ను బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బీద మ‌స్తాన్ రావు, బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణ‌య్య‌ల‌కు ఇస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది.
Go Back to Shorts
YSRCP
YS Jagan
Vijay Sai Reddy
Beeda Mastan Rao
Niranjan Reddy
R.Krishnaiah
Rajya Sabha

More Telugu News