"అన్నా గుర్తున్నామా...!" అంటూ అడిగిన ప్రభాస్ అభిమాని... 'ప్రాజెక్ట్ కె' అప్ డేట్స్ చెప్పిన నాగ్ అశ్విన్ 
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

"అన్నా గుర్తున్నామా...!" అంటూ అడిగిన ప్రభాస్ అభిమాని... 'ప్రాజెక్ట్ కె' అప్ డేట్స్ చెప్పిన నాగ్ అశ్విన్ 

Nag Ashwin replies to Prabhas fan with Project K updates
  • ప్రభాస్ హీరోగా 'ప్రాజెక్ట్ కె'
  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చిత్రం
  • అప్ డేట్స్ కోసం అడిగిన అభిమాని
  • ఒక షెడ్యూల్ పూర్తయిందన్న నాగ్ అశ్విన్
  • ప్రాణం పెట్టి పనిచేస్తున్నామని వెల్లడి
టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వాటిలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న 'ప్రాజెక్ట్ కె' ఒకటి. అయితే, చిత్ర బృందం నుంచి ఎలాంటి అప్ డేట్లు లేకపోవడంతో ప్రభాస్ అభిమాని ఒకరు చొరవచేసి దర్శకుడు నాగ్ అశ్విన్ కు ట్వీట్ చేశారు. గతంలో "రాధేశ్యామ్ విడుదల తర్వాతే అప్ డేట్లు" అంటూ నాగ్ అశ్విన్ ట్వీట్ ను ప్రస్తావిస్తూ "అన్నా గుర్తున్నామా" అంటూ అడిగారు. అందుకు నాగ్ అశ్విన్ "గుర్తున్నారు" అంటూ స్పందించడం విశేషం. అంతేకాదు, 'ప్రాజెక్ట్ కె' వివరాలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు. 

"ఇప్పుడు ఒక షెడ్యూల్ పూర్తయింది. అందులో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ కూడా ఉంది. అందులో ప్రభాస్ ఎంతో కూల్ గా కనిపిస్తాడు. జూన్ చివరి వారం నుంచి మళ్లీ షూటింగ్ ప్రారంభమవుతుంది. రిలీజ్ విషయానికొస్తే ఆ లిస్టులో మనం లాస్టు కదా...! కాబట్టి, మరెన్నో అప్ డేట్లు ఇవ్వడానికి బోలెడంత టైముంది. ప్రాజెక్ట్ కె చిత్రం కోసం అందరం ప్రాణం పెట్టి పనిచేస్తున్నాం" అంటూ నాగ్ అశ్విన్ తన ట్వీట్ లో వివరించారు.

 సైన్స్ ఫిక్షన్ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్ కె' చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనే కథానాయిక కాగా, ఓ ముఖ్యపాత్రకు మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీని ఎంపిక చేశారు. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది.
Nag Ashwin
Project K
Upadates
Prabhas
Fans
Tollywood

More Telugu News