Balakrishna: బాలయ్యతో డింపుల్ హయతి మాస్ మసాలా సాంగ్!

Dumple Hayathi in Gopichand Malineni Movie
  • హాట్ భామగా మార్కులు కొట్టేసిన 'డింపుల్'
  • 'ఖిలాడి' సినిమాతో మరింత పెరిగిన క్రేజ్ 
  • బాలయ్య సినిమా కోసం గ్రీన్ సిగ్నల్
  • సినిమాకి హైలైట్ గా నిలవనున్న ఐటమ్ నెంబర్ 

ఈ మధ్య కాలంలో డింపుల్ హయతి హాట్ బ్యూటీగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. 'గద్దలకొండ గణేశ్' సినిమాలో 'జర్రా జర్రా' ఐటమ్ సాంగ్ తో ఆమె కుర్రకారు మతులు పోగొట్టేసింది. ఆ తరువాత రవితేజ సరసన కథానాయికగా 'ఖిలాడి' సినిమాలో అందాలను ఆరబోసింది.

ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయినా, గ్లామర్ పరంగా ఆమెకి మంచి మార్కులను తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు బాలకృష్ణతో కలిసి ఆమె ఒక మాస్ మసాలా సాంగ్ లో సందడి చేయనున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్య 107వ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. 

ఈ కథ రాయలసీమ నేపథ్యంలో నడుస్తుంది. బాలకృష్ణ సరసన నాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. ఈ సినిమా కోసం మాస్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ నెంబర్ ను తమన్ కంపోజ్ చేశాడట. ఆ పాటను డింపుల్ పై చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకున్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

  • Loading...

More Telugu News