లోపాయికారీ ఒప్పందాల‌పై అనిల్‌కు కౌంట‌ర్ ఇచ్చిన కాల‌వ శ్రీనివాసులు

16-05-2022 Mon 21:27
  • టీడీపీతో ట‌చ్‌లో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ
  • వీరంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారే
  • వీరిని జ‌గ‌న్‌తో స‌స్పెండ్ చేయించాల‌ని కాల‌వ స‌వాల్‌
tdp senior leader kalava srinivasulu counter tweet to ysrcp mla qnilkumar yadav
వైసీపీ ఎమ్మెల్యేల‌తో టీడీపీ సీనియ‌ర్ నేత‌లు లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారంటూ వైసీపీ నేత‌, మాజీ మంత్రి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్య‌ల‌కు టీడీపీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి కాల‌వ శ్రీనివాసులు కౌంట‌ర్ ఇచ్చారు. నెల్లూరులోనే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని చెప్పిన కాల‌వ‌... ద‌మ్ముంటే సీఎం జ‌గ‌న్‌కు చెప్పి వారిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేయించు అంటూ స‌వాల్ విసిరారు.

ఇక టీడీపీతో ట‌చ్‌లో ఉన్న నెల్లూరు వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధుల్లో నిత్యం అనిల్‌తో మాట్లాడే ఓ ఎమ్మెల్యే కూడా ఉన్నార‌ని కాల‌వ శ్రీనివాసులు తెలిపారు. అంతేకాకుండా ప్ర‌తి రోజు అనిల్‌ను, వైసీపీని బ‌హిరంగంగానే బూతులు తిట్టే ఇంకో ఎమ్మెల్యే కూడా ఉన్నార‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. ఈ మేర‌కు అనిల్‌కు కౌంట‌ర్ ఇస్తూ కాల‌వ శ్రీనివాసులు కాసేప‌టి క్రితం ఓ ట్వీట్ చేశారు.