IPL 2022: గెలిచి నిల‌వాల్సిన మ్యాచ్‌... టాస్ నెగ్గి ఛేజింగ్ ఎంచుకున్న పంజాబ్‌

Punjab Kings won the toss and elected to field
షార్ట్స్‌లో చూడండి
ఇటు ఢిల్లీ కేపిట‌ల్స్‌, అటు పంజాబ్ కింగ్స్‌...ఈ రెండు జ‌ట్ల‌కు మ‌రికాసేప‌ట్లో మొద‌లు కానున్న లీగ్ మ్యాచ్ అత్యంత కీల‌కం కానుంది. ఈ మ్యాచ్‌లో ఏ జ‌ట్టు విజ‌యం సాధిస్తే... దానికి ప్లే ఆఫ్స్ ఆశ‌లు సజీవంగా ఉంటాయి. అదే స‌మ‌యంలో ఓడిన జ‌ట్టు మాత్రం ప్లే ఆఫ్స్ ఆశ‌ల‌ను పూర్తిగా వ‌దిలేసుకోక త‌ప్ప‌దు. వెర‌సి ఈ మ్యాచ్ రెండు జట్ల‌కు గెలిచి నిల‌వాల్సిన మ్యాచ్‌గానే ప‌రిణ‌మించింది. 

కాసేప‌టి క్రితం టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జ‌ట్టు ఛేజింగ్‌ను ఎంచుకుంది. తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆ జ‌ట్టు ఢిల్లీని ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇక ఇప్ప‌టిదాకా 12 మ్యాచ్‌లు ఆడిన ఇరు జ‌ట్లు... 6 విజ‌యాల చొప్పున 12 పాయింట్లు సాధించాయి. అయితే నెట్ ర‌న్ రేట్ మెరుగ్గా ఉన్న ఢిల్లీ ఐదో స్థానంలో కొన‌సాగుతుండ‌గా... పంజాబ్ మాత్రం 7వ స్థానంలో ఉంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో మ‌రికాసేప‌ట్లోనే పంజాబ్ త‌న ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నుంది.
Go Back to Shorts
IPL 2022
Delhi Capitals
Punjab Kings

More Telugu News