మహానాడు నిర్వహణకు ఒంగోలు మినీ స్టేడియం ఇవ్వాలన్న టీడీపీ... కుదరదన్న ప్రభుత్వం
- ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు
- ఒంగోలులో నిర్వహించాలని ఇదివరకే నిర్ణయం
- మహానాడు ఏర్పాట్లపై సమీక్షించిన చంద్రబాబు
- ఒంగోలు మినీ స్టేడియాన్ని ఇవ్వకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం
- నగర సమీపంలోని మండవారిపాలెంలో మహానాడు
ఒంగోలు మినీ స్టేడియాన్ని మహానాడుకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించడంతో వేడుకను ఒంగోలు సమీపంలోని మండవారిపాలెంలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను శరవేగంగా చేపట్టాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.