పార్టీ పదవుల్లో 50 శాతం వీరికే: కాంగ్రెస్ కీలక నిర్ణయం

14-05-2022 Sat 17:43
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు 50 శాతం పదవులు
  • చింతన్ శిబిర్ సమావేశాల్లో కీలక నిర్ణయం
  • పార్టీలో సంస్థాగతమైన మార్పుల దిశగా కాంగ్రెస్
Congress party announces key decision
కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీ పదవుల్లో 50 శాతం పదవులను ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనార్టీలకు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల చింతన్ శిబిర్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు రెండో రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ తన భవిష్యత్ కార్యాచరణపై లోతుగా చర్చిస్తోంది. పార్టీలో సంస్థాగతమైన మార్పులను తీసుకురావడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు పార్టీ కీలకనేత ఒకరు తెలిపారు.