అలాంటి అవ‌కాశాలు రాన‌ప్పుడు వేరే ఉద్యోగం వెతుక్కుంటాను: హీరో సిద్ధార్థ్‌

14-05-2022 Sat 12:02
  • ఆసక్తికరమైన పాత్రల్లో నటించే అవకాశం వచ్చినంతవరకూ న‌టిస్తాన‌న్న సిద్ధార్థ్
  • తాను అధికంగా దక్షిణాది చిత్రాల్లోనే నటించానని వ్యాఖ్య‌
  • చాలామంది తాను ఢిల్లీకి చెందిన వ్య‌క్తిన‌న్న విష‌యాన్ని మర్చిపోయారన్న హీరో
Siddharth on his new movie
ఆసక్తికరమైన పాత్రల్లో నటించే అవకాశం వచ్చినంతవరకూ తాను సినిమాల్లో నటిస్తానని, ఒకవేళ అటువంటి అవకాశాలు రానప్పుడు వేరే ఉద్యోగం వెతుక్కుంటాన‌ని సినీ హీరో సిద్ధార్థ్ చెప్పాడు. నటుడిగా నా కెరీర్‌ ప్రారంభమైనప్ప‌టి నుంచి తాను అధికంగా దక్షిణాది చిత్రాల్లోనే నటించానని ఆయ‌న చెప్పాడు. 

దీంతో చాలామంది తాను ఢిల్లీకి చెందిన వ్య‌క్తిన‌న్న విష‌యాన్ని కూడా మర్చిపోయారని ఆయ‌న తెలిపాడు. తాను హిందీ చాలా బాగా మాట్లాడతానని, ఆసక్తికరమైన పాత్రలు వచ్చినప్పుడు హిందీ సినిమాల్లో నటిస్తుండటం ఒక అలవాటుగా మారిందని చెప్పాడు. 

కాగా, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ వెబ్ సిరీస్‌ 'ఎస్కేప్ లైవ్' సిరీస్‌ మే 20 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్ర‌సారం కానుంది. ఈ సినిమా కథ త‌న‌కు బాగా నచ్చిందని, అందుకే వెంటనే ఓకే చేశానని సిద్ధార్థ్ చెప్పాడు.