YSRCP: బ‌ర్త్‌డే నాడు జ‌గ‌న్ ఆశీస్సులు తీసుకున్న వైసీపీ యువ ఎంపీ

margani bharat takes blesses from ys jagan on his birth day
  • నేడు రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ మార్గాని భ‌ర‌త్‌ జన్మదినం 
  • తాడేప‌ల్లిలో సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన ఎంపీ
  • జ‌న్మ‌దినాన జ‌గ‌న్ ఆశీస్సుల కోస‌మే వ‌చ్చాన‌ని వెల్ల‌డి
వైసీపీ యువ నేత, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం పార్ల‌మెంటు స‌భ్యుడు మార్గాని భ‌ర‌త్ రామ్ గురువారం నాడు సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో క‌లిశారు. గురువారం త‌న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని జ‌గ‌న్ ఆశీస్సుల కోస‌మే తాడేప‌ల్లికి వ‌చ్చాన‌ని, ఆయన ఆశీస్సులు తీసుకున్నాన‌ని భరత్ తెలిపారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదికగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించిన భరత్... జ‌గ‌న్ ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోల‌ను కూడా షేర్ చేశారు.
YSRCP
YS Jagan
Margani Bharat

More Telugu News