TDP: బాబు రావాలి.. బాధ‌లు తీరాలి: చంద్ర‌బాబు టూర్‌లో ద్ర‌విడ వ‌ర్సిటీ విద్యార్థుల నినాదాలు

dravida versity students met chandrababu
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు కుప్పం ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం బుధ‌వారం కుప్పం వెళ్లిన చంద్ర‌బాబు... రెండో రోజైన గురువారం కుప్పం ప‌రిధిలోని ప‌లు ప‌ల్లెల్లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కుప్పం ప‌రిధిలోని ద్ర‌విడ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన విద్యార్థులు చంద్ర‌బాబుకు త‌మ గోడును వెళ్ల‌బోసుకున్నారు. వ‌ర్సిటీలో క‌నీస స‌దుపాయాలు లేవ‌ని, లెక్క‌లేన‌న్ని స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్నామ‌ని ఈ సంద‌ర్భంగా వారు చంద్ర‌బాబుకు తెలిపారు. 

ఈ సంద‌ర్భంగా విద్యార్థులు బాబు రావాలి.. మా బాధ‌లు తీరాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రించ‌మ‌ని అడిగితే ప‌ట్టించుకునే నాథుడే క‌రువ‌య్యాడంటూ విద్యార్థులు చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేశారు. త‌మ స‌మ‌స్యల ప‌రిష్కారంపై దృష్టి సారించాల‌ని వారు ఆయ‌న‌ను వేడుకున్నారు.
Go Back to Shorts
TDP
Chandrababu
Kuppam
Dravida University

More Telugu News