Rajyasabha: 57 రాజ్య‌స‌భ సీట్ల ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల‌.. తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాల‌కు ఎన్నిక‌లు

election notification to 57 rajyasabha seats including 6 in telugu states
  • ఈ నెల 24న నోటిఫికేష‌న్‌
  • జూన్ 10న పోలింగ్‌, అదే రోజు ఫ‌లితాలు
  • ఏపీలో ఖాళీ కానున్న 4 సీట్లు, తెలంగాణ‌లో 2 ఖాళీ
రాజ్య‌స‌భ‌లో త్వ‌ర‌లో ఖాళీ కానున్న 57 స్థానాల‌ను భ‌ర్తీ చేసేందుకు ఆయా రాజ్య‌స‌భ సీట్ల ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గురువారం నోటిఫికేష‌న్ జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు స‌హా 15 రాష్ట్రాల‌కు చెందిన ఈ సీట్ల‌కు జూన్ 10న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక‌లకు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఈ నెల 24న విడుద‌ల చేయ‌నుంది.

ఇక ఖాళీల వివ‌రాల్లోకెళితే... ఏపీలో 4 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదే స‌మ‌యంలో తెలంగాణ‌లో రెండు స్థానాల‌కు ఎన్నిక‌లు జరుగుతాయి. ఏపీలో వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి స‌హా.. బీజేపీ స‌భ్యులుగా ఉన్న సుజ‌నా చౌద‌రి, సురేశ్ ప్ర‌భు, టీజీ వెంక‌టేశ్‌ల ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. తెలంగాణ‌కు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు, డి. శ్రీనివాస్‌ల ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. ఈ స్థానాల‌ను భ‌ర్తీ చేసేందుకే కొత్త‌గా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.
Rajyasabha
Parliament
Election Commission

More Telugu News