Boeny Kapoor: బాలీవుడ్ పై మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలపై బోనీ కపూర్ ఏమన్నారంటే...!

Boney Kapoor opines on Mahesh Babu comments on Bolywood
  • బాలీవుడ్ తనను భరించలేదన్న మహేశ్
  • తీవ్ర చర్చనీయాంశంగా మహేశ్ వ్యాఖ్యలు
  • స్పందించడానికి తాను సరైన వ్యక్తిని కానన్న బోనీ 
బాలీవుడ్ తనను భరించలేదంటూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ స్పందించారు. మహేశ్ వ్యాఖ్యల పట్ల తాను ఏమీ మాట్లాడబోనని అన్నారు. మహేశ్ కామెంట్లపై స్పందించడానికి తాను తగిన వ్యక్తిని కాదని వినమ్రంగా తెలిపారు. 

మహేశ్ ఆ విధంగా అనడానికి ఆయన కారణాలు  ఆయనకు ఉండొచ్చని బోనీ కపూర్ అభిప్రాయపడ్డారు. తన అభిప్రాయాన్ని తాను వ్యక్తపరిచాడని పేర్కొన్నారు.  తాను ఉత్తరాది, దక్షిణాది రెండు ప్రాంతాలకు చెందిన వాడినని, ఇప్పటికే తెలుగు, తమిళంలో సినిమాలు చేశానని, త్వరలోనే మలయాళం, కన్నడ భాషల్లోనూ చిత్రాలు చేస్తున్నానని వివరించారు. ఈ నేపథ్యంలో ఇంతకుమించి తానేమీ మాట్లాడలేనని బోనీ కపూర్ స్పష్టం చేశారు.
Boeny Kapoor
Mahesh Babu
Bollywood
Tollywood

More Telugu News