ప్రధాని మోదీకి అతిపెద్ద రాఖీని కానుకగా ఇచ్చిన గుజరాత్ మహిళలు
- ఉత్కర్ష్ సమారోహ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని
- వర్చువల్ గా ప్రసంగించిన మోదీ
- భారీ రాఖీ బహూకరించిన బరూచ్ మహిళలు
- తనకు కోట్లాది మహిళల రక్షణ ఉందన్న మోదీ
అందుకు ప్రధాని మోదీ బదులిస్తూ... గుజరాత్ మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. రాఖీ రూపంలో తనకు ఎనలేని బలాన్ని అందించారని తెలిపారు. దేశాభివృద్ధి, మహిళల సంక్షేమం కోసం తాను మరింత కష్టపడేలా పనిచేసేందుకు ఈ రాఖీ స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నానని, ఆ క్రమంలో తనకు రక్షణకవచంలా పనిచేస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. తాను గుజరాత్ లో వున్నప్పుడు తన రక్షణకు సంబంధించి అనేక ఆందోళనలు తలెత్తేవని, అయితే, కోట్లాది మంది తల్లుల రక్షణ తనకుందని చెప్పేవాడినని మోదీ గర్వంగా అన్నారు.