Tirupati District: పరీక్ష కేంద్రంలో గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి

Inter student in AP died with heart attack in exam centre
  • గూడూరులో విషాదకర ఘటన
  • గుండెపోటుతో కుప్పకూలిన సతీశ్ అనే విద్యార్థి
  • ఆసుపత్రికి తరలించినా దక్కని ఫలితం
తిరుపతి జిల్లా గూడూరులో విషాదం చోటు చేసుకుంది. పరీక్ష రాసేందుకు వచ్చిన సతీశ్ అనే ఇంటర్ విద్యార్థి గుండెపోటుకు గురై మృతి చెందాడు. గూడూరు డీఆర్డబ్ల్యూ పరీక్ష కేంద్రానికి సతీశ్ వచ్చాడు. గేటు వద్దకు వచ్చినప్పుడే ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాత గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. 

దాంతో అతన్ని వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతన్ని పరీక్షించగా అప్పటికే మరణించినట్టు తేలింది. మృతుడు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి. సతీశ్ ని సైదాపురంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సతీష్ మృతి చెందినట్టు అతని తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. మరోవైపు, ఈ ఘటనతో పరీక్ష కేంద్రం వద్ద విషాదం నెలకొంది.
Tirupati District
Gudur
Inter Student
Heart Attack

More Telugu News