Sonakshi Sinha: రహస్యంగా ఎంగేజ్ మెంట్ చేసుకున్న బాలీవుడ్ భామ సోనాక్షి.. కాబోయే భర్త ఈయనేనా?

Sonakshi Sinha got engaged
  • చేతికి డైమండ్ రింగ్ పెట్టుకున్న ఫొటో షేర్ చేసిన సోనాక్షి
  • ఈరోజు నాకు గొప్ప రోజు అంటూ కామెంట్
  • జహీర్ ఇక్బాల్ తో కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న వైనం
బాలీవుడ్ ముద్దుగుమ్మ, సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకుంది. చేతికి డైమండ్ రింగ్ పెట్టుకున్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు తనకు కాబోయే భర్తను పట్టుకుని ఫొటోలో కనిపించింది. అయితే, తన ప్రియుడి ముఖాన్ని మాత్రం చూపించకుండా సీక్రెట్ మెయింటెయిన్ చేసింది. 

'ఈ రోజు నాకు ఒక గొప్ప రోజు. ఎప్పటి నుంచో నాకున్న ఒక పెద్ద కల నెరవేరబోతోంది. ఇది జరిగిందంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. 

సోనాక్షి ఎంగేజ్ మెంట్ పై ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే, ఇంత సీక్రెట్ గా చేసుకోవాల్సిన అవసరం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. కాబోయే భర్త ముఖాన్ని దాయాల్సిన అవసరం ఏమిటని అడుగుతున్నారు. మరోవైపు, గత కొంత కాలంగా జహీర్ ఇక్బాల్ తో సోనాక్షి డేటింగ్ చేస్తోందనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమయ్యాయి. దీంతో, జహీర్ తోనే ఆమె ఎంగేజ్ మెంట్ జరిగిందని కొందరు కామెంట్లు పెడుతున్నారు.
Sonakshi Sinha
Engagement
Bollywood

More Telugu News