Imran Khan: నోటిని అదుపులో పెట్టుకోకుంటే భారీ మూల్యం తప్పదు: ఇమ్రాన్‌ఖాన్‌ను హెచ్చరించిన పాక్ ప్రధాని

Shehbaz Sharif threatens legal action against Imran Khan

  • ఇటీవల పదవీచ్యుతుడైన ఇమ్రాన్ ఖాన్
  • ఇమ్రాన్ దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారన్న ప్రధాని
  • పౌర యుద్ధానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణ

పదవీచ్యుతుడైన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు తాజా ప్రధాని షాబాజ్ షరీఫ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇమ్రాన్ తన నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. దేశ ప్రజలను, వ్యవస్థలను కించపరచడం మానుకోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. 

ఇమ్రాన్ ఇటీవల మాట్లాడుతూ.. తనను పదవీచ్యుతుడిని చేస్తున్నప్పుడు తటస్థంగా ఉండి చూస్తున్నవారంతా జంతువులేనంటూ ఆర్మీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే, ఈ నెల 20న 30 లక్షల మందితో ఇస్లామాబాద్‌లో భారీ ర్యాలీకి ఇమ్రాన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో షాబాజ్ తాజాగా మాట్లాడుతూ.. ఇమ్రాన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తూ ఆర్మీని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పౌర యుద్ధానికి ఇమ్రాన్ ప్రయత్నిస్తున్నారని ప్రధాని ఆరోపించారు.

Imran Khan
Shebez Sharif
Pakistan
  • Loading...

More Telugu News